Sun Nov 17 2024 21:47:09 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వేవ్ అంతా హస్తం వైపే... ట్రెండ్ వన్ సైడ్ గానే
కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న చోట భారీ ఆధిక్యతతో బీఆర్ఎస్ లీడ్ లో ఉన్న చోట మాత్రం స్వల్ప ఆధిక్యత కనిపిస్తుంది
కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న చోట భారీ ఆధిక్యతతో ఆ పార్టీ అభ్యర్థులు కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ లీడ్ లో ఉన్న చోట మాత్రం స్వల్ప ఆధిక్యత కనిపిస్తుండటం కాంగ్రెస్ వేవ్ ఎంతగా పనిచేసిందో ఇట్టే చెప్పవచ్చు. కాంగ్రెస్ వేవ్ యాభై శాతం అయితే.. అధికార పార్టీ అసంతృప్తి ఒక్కసారిగా బరస్ట్ అయిందనే చెప్పాలి. అంటే ట్రెండ్ అంతా కాంగ్రెస్ వైపు ఉందనే అనుకోవాలి. కాస్త అటు ఇటుగా అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్లే వస్తున్న ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.
ఈ స్థానాల్లో....
ఇక భారీ ఇప్పటి వరకూ ఎనిమిది, తొమ్మిది రౌండ్లు పూర్తయ్యాయి. ఇందులో ఏడు నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొడంగల్, ఆంథోల్, ఇల్లెందు, హుజూర్ నగర్, మానకొండూరు, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీగా మెజారిటీ కనిపిస్తుంది. ఇక్కడ వీరి గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పాలి ఇక కుత్బుల్లాపూర్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద భారీ స్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన విజయం సాధించే ఛాన్స్ ఉంది.
Next Story