Mon Mar 31 2025 14:12:41 GMT+0000 (Coordinated Universal Time)
KTR : అట్టర్ ప్లాప్ సినిమాకు.. అట్టహాసం అవసరమా అధ్యక్ష్యా?
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు

తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. అట్టర్ ప్లాప్ సినిమాకు అట్టహాసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. విద్యాశాఖకు పదిహేను శాతం బడ్జెట్ అని ఏడు శాతం కేటాయింపులు జరిపారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఓ స్త్రీ రేపురా అన్నట్లుందని అన్నారు. ఇరవై వేల టీచర్ల పోస్టుల భర్తీ అన్నారని, పదకొండు వేలు మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. 1931 పాఠశాలలు మూతపడ్డాయని సాక్షాత్తూ మంత్రి తెలిపారు.
పదవిలోకి వచ్చిన తర్వాత...
పదవిలోకి వచ్చిన తర్వాత ఇంతటి ఫస్ట్రేషన్ ఇప్పటి వరకకూ ఏ అధికార పార్టీ నేతల్లో చూడలేదని కేటీఆర్ తెలిపారు. ఓల్డ్ పెన్షన్ స్కీం తెస్తామని చెప్పారని, ఎప్పుడు తెస్తారో చెప్పలేదని కేటీఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ చూసినా, రాష్ట్ర బడ్జెట్ చూసినా రెండు పార్టీలు తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారన్నారు. ప్రజలు మరో ఇరవై ఏళ్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితి లేదని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని దుయ్య బట్టారు.
Next Story