Mon Dec 23 2024 13:46:51 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ మార్క్ బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం కంటే తెలంగాణ అన్ని వర్గాలను ఆదుకుంటుందని చాటి చెప్పేలా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వం కంటే తెలంగాణ అన్ని వర్గాలను ఆదుకుంటుందని చాటి చెప్పేలా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది. పాత పథకాలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతూ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దమవుతున్నారు. ప్రధానంగా రైతులు, దళితులు, బీసీ, మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ కు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో ఆదేశించారు.
ప్రతి వర్గం.....
కేసీఆర్ ఆదేశాల ప్రకారం ప్రతి వర్గానికి లబ్ది చేకూరేలా బడ్జెట్ ను అధికారులు రూపొందింాచరు. ఇప్పటికే ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత విద్యుత్తు, గొర్రెల పంపిణీ, రైతు బంధు వంటి పథకాలను కొనసాగిస్తూనే ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చేలా రూపొందించిన పథకానికి కూడా పెద్ద యెత్తున నిధులు ఈ బడ్జెట్ లో కేటాయించినట్లు తెలిసింది. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు, వైన్ షాపుల్లో గౌడ, ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు వంటి వాటితో ఇప్పటికే ఆ వర్గాలను కేసీఆర్ఆకట్టుకున్నారు.
రాష్ట్ర ఆదాయం....
సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గొర్రెలు, చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో గతంలో కంటే మాంసం ఉత్పత్తి రాష్ట్రంలో 22 శాతం పెరిగింది. అందుకే సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద ఈ బడ్జెట్ పూర్తిగా సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడుతుంది.
Next Story