Sun Mar 30 2025 08:05:57 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ చెప్పిన భట్టి.. వేసవిలో విద్యుత్తు కోతలుండవ్
విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు సంస్కరణలను ఎన్నో తెచ్చామని చెప్పిన ఆయన వేసవిలో విద్యుత్తు కోతలు లేకుండా సరఫరా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. గతం కంటే ప్రస్తుతం డిమాండ్ పెరిగినా అందుకు తగిన విధంగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నామని తెలిపారు. పీక్ అవర్స్ లో జల విద్యుత్తు ద్వారా విద్యుత్తును రివర్స్ పంపింగ్ చేస్తూ సరఫరా చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
డిమాండ్ పెరిగినా...
20225లో విద్యుత్తు డిమాండ్ విపరీతంగా పెరగడంతో అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని భట్టి తెలిపారు. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చామన్న భట్టి ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ ను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తూనే విద్యుత్తు రాయితీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రెండు వందల యూనిట్ల వరకూ యాభై లక్షల మంది గృహవినియోగదారులకు ఉచిత విద్యుత్తుతో పాటు వ్యవసాయరంగానికి నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు కూడా ఉచిత విద్యుత్తును అమలులోకి తెచ్చామన్నారు.
Next Story