Mon Dec 23 2024 11:28:39 GMT+0000 (Coordinated Universal Time)
పూజలు చేసిన అనంతరం హరీశ్ రావు?
ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఇంటి నుంచి నేరుగా బయలుదేరి టీటీడీ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఇంటి నుంచి నేరుగా బయలుదేరి టీటీడీ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. బడ్జెట్ ప్రతులను స్వామి వారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హరీశ్ రావు అసెంబ్లీకి రానున్నారు.
పటిష్ట బందోబస్తు...
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశఆరు. లాబీల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలను మినహా ఎవరినీ అనుమతించరు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story