Mon Dec 23 2024 14:13:17 GMT+0000 (Coordinated Universal Time)
బడ్జెట్ లో ఆ పథకానికి పదివేల కోట్లు
సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు వారికి ప్రభుత్వ సాయం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణ బడ్జెట్ లో అనేక పథకాలకు నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హామీలు ఇచ్చిన పథకాలతో పాటు కొత్త వాటికి కూడా భారీగానే నిధులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు వారికి ప్రభుత్వ సాయం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను అందరికీ అందించలేకపోతుండటంతో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనిస్తుంది.
రెండు లక్షల మందికి...
ఇందుకోసం ఈసారి బడ్జెట్ లో 10 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. ఒక్కొక్కరు తమ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రెండు లక్షల మందికి ఈ సాయం అందించాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్ లో ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనుంది.
Next Story