Mon Dec 23 2024 14:22:53 GMT+0000 (Coordinated Universal Time)
సంక్షేమంపైనే దృష్టి.. ఎన్నికల బడ్జెట్ గానే
తెలంగాణ బడ్జెట్ ఈసారి అంచనాలకు మించి ఉండనుంది. గత ఏడాది 2.30 లక్షల కోట్లకు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు
తెలంగాణ బడ్జెట్ ఈసారి అంచనాలకు మించి ఉండనుంది. గత ఏడాది 2.30 లక్షల కోట్లకు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి దాని అంచనా 2.70 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబడులు, కేటాయింపులు, ప్రాధాన్యతలను బట్టి బడ్జెట్ కేటాయింపులను జరిపారు. ఈ ఏడాది పన్నుల ద్వారా రాబడి రాష్ట్రానికి బాగా ఉండటంతో సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశముందని అధికారులు చెప్పారు.
వ్యవసాయం.. దళితబంధు...
జీఎస్డీఏ వృద్ధి రేటు 19 శాతానికి పైగానే ఉండటం, పన్నుల రాబడి 20 శాతానికి పైగానే ఉండటంతో భారీగా కేటాయింపులు జరపనున్నారు. మొత్తం బడ్జెట్ 2.70 లక్షల కోట్లకు పైగానే ఉంటే, అందులో సంక్షేమ పథకాలకు దాదాపు 1.50 లక్షల కోట్లు కేటాయింపులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. నిర్వహణ వ్యయం 1.20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయరంగానికి ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. దళిత బంధు పథకం కోసం 20 వేల కోట్లు కేటాయంపులు జరిపినట్లు సమాచారం. ఇక మిగిలిన సంక్షేమ పథకాలను యధాతధంగా కొనసాగించనున్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ గానే చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Next Story