Mon Dec 23 2024 10:44:49 GMT+0000 (Coordinated Universal Time)
భద్రాద్రి వద్ద గోదారి భయానకం
భద్రాచలం వద్ద నీటిమట్టం గంటగంటకూ పెరుగుతుంది. నీటి మట్టం 67.10 అడుగులకు చేరుకుంది
భద్రాచలం వద్ద నీటిమట్టం గంటగంటకూ పెరుగుతుంది. నీటి మట్టం 67.10 అడుగులకు చేరుకుంది. కాసేపట్లో 70 అడుగులకు చేరే అవకాశముందని అధికారులు తెలిపారు. నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో భద్రాచలం పట్టణానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుండటంతో మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే భద్రాచలం పట్టణం కూడా నీట మునిగింది. నలువైపులా నీరు చేరడంతో పట్టణంలో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పట్టణంలోకి....
జులైలో ఈ స్థాయిలో గోదావరి ఎప్పుడూ రాలేదంటున్నారు స్థానికులు. 1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీరు వచ్చింది. ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ నీట మునిగాయి. మూడో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతుంది. అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ముంపుకు గురైన కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
Next Story