Mon Dec 23 2024 10:00:22 GMT+0000 (Coordinated Universal Time)
టెన్త్ లోనూ బాలికలదే అగ్రస్థానం
తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు మంత్రి తెలిపారు. 79 శాతంతో చివరి స్థానంలో హైదరాబాద్ జిల్లా నిలిచింది. ఈ ఏడాది 5.09 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారన్నారు. బాలికల్లో 92.45 శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. బాలురు 87 శాతం మంది ఉత్తీర్ణుతులయినట్లు మంత్రి సబిత తెలిపారు.
3007 పాఠశాలల్లో 100 శాతం...
టెన్త్ పరీక్షల్లో మొత్తం 90 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 15 స్కూళ్లలో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేదు. 3007 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ఫెయిలయిన విద్యార్థులు ఎవరూ నిరాశ చెందవద్దని, సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని సబిత ఇంద్రారెడ్డి విద్యార్థులను కోరారు.
Next Story