Mon Dec 23 2024 03:43:20 GMT+0000 (Coordinated Universal Time)
వీధికుక్కల దాడిలో మరో చిన్నారి మృతి
వెంటనే మహేశ్వరిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు నెలరోజులుగా మహేశ్వరికి వైద్యులు చికిత్స
హైదరాబాద్ లోని అంబర్ పేటలో సుమారు నెలరోజుల క్రితం ప్రదీప్ అనే చిన్నారిని వీధికుక్కలు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ దృశ్యం ఇంకా కళ్లముందే కదలాడుతుండగానే.. కరీంనగర్లో మరో చిన్నారి వీధికుక్కల దాడిలో గాయపడి కన్నుమూసింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో మహేశ్వరి (13) నెలరోజుల క్రితం ఇంటిముందు కూర్చుని చదువుకుంటున్న సమయంలో కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో మహేశ్వరికి గాయాలయ్యాయి.
వెంటనే మహేశ్వరిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు నెలరోజులుగా మహేశ్వరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మహేశ్వరి ప్రాణాలు విడిచింది. అంబర్ పేట ఘటన తర్వాత.. తెలంగాణలో అలాంటి వీధికుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులు గాయపడుతూనే ఉన్నారు. మున్ముందు చిన్నారులు వీధికుక్కల దాడికి బలికాకుండా ఉండాలంటే.. ప్రభుత్వం వాటి నిర్మూలన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story