Sat Nov 23 2024 04:51:24 GMT+0000 (Coordinated Universal Time)
తాగినోళ్లు తాగినట్లే.. మద్యం ఆదాయం ఎంతంటే?
నిన్న రాత్రి ఒక్క తెలంగాణలోనూ 215.74 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి
నూతన సంవత్సరం వస్తుందంటే సంబరమే. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకూ తెలియని ఉత్సాహంతో ఊగిపోతారు. కొత్త ఏడాదిలో కొత్త కోరికలు నెరవేరతాయని అనేక మంది ఆశిస్తారు. అదే సమయంలో డిసెంబరు 31వ తేదీ రాత్రికి మద్యం తాగనిదే మజా రాదనే వారు అనేక మంది ఉన్నారు. పార్టీలు చేసుకుంటూ రాత్రి 12 గంటల వరకూ ఊగిపోతారు. తర్వాత న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుని సంతోషపడతారు.
తెలుగు రాష్ట్రాల్లో...
అందుకే ప్రభుత్వాలు కూడా మద్యం దుకాణాలను అర్ధరాత్రి ఒంటి గంట వరకూ నిర్వహించేందుకు అనుమతిస్తుంది. దీంతో మందుబాబులు చిందులేస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. నిన్న రాత్రి ఒక్క తెలంగాణలోనూ 215.74 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క హైదరాబాద్ లోనే 37 కోట్ల మేకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఆంధప్రదేశ్ లోనూ జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. నిన్న ఒక్క రోజే 127 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వాలకు మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం లభించింది.
Next Story