Mon Dec 23 2024 01:53:35 GMT+0000 (Coordinated Universal Time)
రేపు హైదరాబాద్ లో 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. వివరాలివిగో !
లింగంపల్లి-హైదరాబాద్ మధ్యలో 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య 9 సర్వీసులను రద్దుచేసినట్లు తెలిపారు.
రేపు హైదరాబాద్ లో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. పలు లైన్లలో మరమ్మతులున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లింగంపల్లి-హైదరాబాద్ మధ్యలో 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య 9 సర్వీసులను రద్దుచేసినట్లు తెలిపారు. అలాగే ఫలక్ నుమా-లింగంపల్లి మధ్య ఏడు సర్వీసులు, లింగంపల్లి-ఫలక్ నుమా మధ్య ఏడు సర్వీసులను రద్దుచేశారు. సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే 47150 రైలు, లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య నడిచే 47192 రైలును కూడా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
లింగంపల్లి – హైదరాబాద్ మధ్య రద్దు అయిన సర్వీసులు..
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140
హైదరాబాద్ – లింగంపల్లి మధ్య రద్దైన సర్వీసులు..
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
ఫలక్నూమా – లింగంపల్లి మధ్య రద్దైన సర్వీసులు..
47153, 47164, 47165, 47166, 47203, 47170, 47220
లింగంపల్లి – ఫలక్నూమా మధ్య రద్దైన సర్వీసులు..
47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192
Next Story