Fri Nov 22 2024 14:33:14 GMT+0000 (Coordinated Universal Time)
8 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ లిస్టులో..!
నేషనల్ హెరాల్డ్ కేసులో అసోసియేటెడ్ జర్నల్స్, యంగ్ ఇండియన్ ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుగుతున్న
నేషనల్ హెరాల్డ్ కేసులో అసోసియేటెడ్ జర్నల్స్, యంగ్ ఇండియన్ ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో, యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎనిమిది మంది రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు విరాళం ఇవ్వడంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారనే కథనాలు వస్తున్నాయి. మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి.. తదితరులకు త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందే అవకాశం ఉంది.
షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. "మాకు ఇప్పటివరకు ఎటువంటి నోటీసులు రాలేదు, అయితే ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులపై ED నోటీసులు పంపే అవకాశం ఉందని మా లాయర్, TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాకు చెప్పారు. హైకమాండ్ ఆదేశం మేరకు మేము యంగ్ ఇండియా ఖజానాకు విరాళాలు ఇచ్చాము. లావాదేవీలు చట్టబద్ధంగా, చెక్కు ద్వారా జరిగాయి. ఇది నేరం కాదు. ED మాకు సమన్లు పంపితే, మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాము. పార్టీ కేంద్ర నాయకత్వానికి అండగా ఉంటాం. నేను రూ. 20 లక్షలు మరియు ఇతరులు రూ. 10 లక్షల నుండి 25 లక్షల మధ్య విరాళం ఇచ్చారు." అని చెప్పుకొచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఢిల్లీ విభాగం ఇప్పటికే సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలను ప్రశ్నించింది. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ఆస్తులను కాంగ్రెస్ నేతలకు చెందిన యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) స్వాధీనం చేసుకుందని ఆయన ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నుండి నోటీసులు ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 3 వ తేదీన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. యంగ్ ఇండియన్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు 78 శాతం వాటా ఉంది. మిగతా వాటా మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు ఉంది.
Next Story