Mon Dec 23 2024 12:45:02 GMT+0000 (Coordinated Universal Time)
గాంధీభవన్ లో రగడ.. డిగ్గీరాజా ఉండగానే?
దిగ్విజయ్ సింగ్ ఉండగానే గాంధీ భవన్ లో ఘర్షణ జరిగింది
దిగ్విజయ్ సింగ్ ఉండగానే గాంధీ భవన్ లో ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని సారీ చెప్పాలంటూ ఓయూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అసంతృప్త సీనియర్ నేతలపై అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సక్రమంగా లేవని వారన్నారు. దిగ్విజయ్ సింగ్ ఎదుటనే అనిల్ కుమార్ ను కాంగ్రెస్ నేతలు కొందరు నలదీవారు.
సారీ చెప్పాలని...
దీంతో అనిల్ కుమార్ కూడా వారితో గొడవకు దిగారు. గాంధీభవన్ లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మల్లు రవి వంటి నేతలు ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అనిల్ కుమార్ సారీ చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టిన వారిని శాంతింప చేశారు. కొంతకాలం క్రితం సీనియర్ నేతలను ఉద్దేశించి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Next Story