Mon Dec 23 2024 16:38:33 GMT+0000 (Coordinated Universal Time)
Medigadda : నేడు మేడిగడ్డకు మంత్రులు
నేడు మేడిగడ్డకు తెలంగాణ మంత్రుల బృందం బయలుదేరి వెళ్లనుంది. అక్కడ కుంగిపోయిన ప్రాజెక్టును పరిశీలించనుంది.
నేడు మేడిగడ్డకు తెలంగాణ మంత్రుల బృందం బయలుదేరి వెళ్లనుంది. అక్కడ కుంగిపోయిన ప్రాజెక్టును పరిశీలించనుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ లు వెళ్లనున్నారు. నేరుగా మేడిగడ్డకు చేరుకుని అక్కడ కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి మేడగడ్డకు చేరుకోనున్నారు.
సమీక్షించనున్న...
ఇటీవల మేడిగడ్డ డ్యామ్ వద్ద 19,20,21 పిల్లర్లు కుంగిపోవడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీంతో తెలంగాణ - మహారాష్ట్రల మధ్య రాకపోకలను కూడా నిలిపివేశారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్దయెత్తున అక్రమాలు, అవినీతి జరిగిందని ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై నేడు పరిశీలించి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు మంత్రులు.
Next Story