Mon Dec 23 2024 12:38:52 GMT+0000 (Coordinated Universal Time)
ఖమ్మంలో 40 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
ఖమ్మంలోని లకారం చెరువు తీగల వంతెన మధ్య భాగంలో ఎన్టీఆర్ నలభై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు
ఖమ్మంలోని లకారం చెరువు తీగల వంతెన మధ్య భాగంలో ఎన్టీఆర్ నలభై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఖమ్మం నగరంలోని లకాంం చెరువు తీగల వంతెన మధ్యలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. కృష్ణావతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేయించారు. మొత్తం 40 అడుగుల భారీ విగ్రహాన్ని త్వరలోనే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించనున్నారు.
ఎన్టీఆర్ అభిమానులు....
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక కృషితో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు జరుగుతోంది. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విగ్రహం పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.
Next Story