Fri Nov 22 2024 09:11:57 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కవితకు బిగ్ రిలీఫ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కవితకు బెయిల్ మంజూరయింది. జస్టసిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ ధర్మాసనం విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై సీబీఐ, ఈడీలు కేసుల్లో ఆమె తనకు బెయిల్ ఇప్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కల్వకుంట్ల కవిత తరుపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ తన వాదనలను వినిపించారు. కవిత విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. సౌత్ గ్రూపు సంస్థల నుంచి వంద కోట్లు వసూలు చేశారంటున్నారని, కానీ ఆ మొత్తాన్ని ఇంత వరకూ దర్యాప్తు సంస్థలు రికవరీ చేయలేదని ప్రస్తావించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈ ఏడాది మార్చి 15వ తేదీన అరెస్టయ్యారు. గత ఐదు నెలల నుంచి తీహార్ జైలులో ఉంటున్నారు. ఆమెకు పలుమార్లు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. కవిత తరుపున న్యాయవాది ఆరోగ్య సమస్యలను గురించి కూడా ప్రస్తావించారు. కవిత ఎక్కడికీ పారిపోరని అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత సమర్పించారన్నారు. కవిత ఎవరినీ బెదించలేదన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఇప్పటికే విచారణ పూర్తయినందున ఆమెకు బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహత్గి వాదించారు. ఆమె దేశం విడిచి పారిపోరన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు కూడా వర్తిస్తాయని ముకుల్ రోహిత్గీ అన్నారు. కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story