Sun Dec 14 2025 18:22:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సుప్రీంలో విచారణ
రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది

రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై పోలీసులు అక్రమంగా పీడీయాక్ట్ పెట్టారని కోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి చర్లపల్లి జైలులో ఉంచారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఒక వర్గాన్ని కించపర్చారన్న కేసులో రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ కేసులు బనాయించి తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు.
నేడు నిరసనలు...
ఈ నేపథ్యంలో రాజాసింగ్ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. పీడీ యాక్ట్ ఉంటే ఇప్పట్లో బెయిల్ రాదు. దీంతో పాటు హిందూ సంస్థలు కొన్ని నేడు ఆందోళనకు పిలుపు నిచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో భజరంగ్ దళ్ బంద్ కు పిలుపునిచ్చింది. అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలియజేయాలని హిందూ సంస్థలు నిర్ణయించాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

