Wed Jan 08 2025 11:57:55 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన
తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన జరిగింది. స్వాతంత్ర్యం వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన చేశారు.
తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన జరిగింది. స్వాతంత్ర్యం వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన చేశారు. ఆబిడ్స్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
ఎక్కడికక్కడ వాహనాలు...
జాతీయ గీతాలాపన సందర్భంగా లక్షలాది వాహనాలు తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఒక నిమిషం పాటు రెడ్ సిగ్నల్ పడింది. జాతీయ గీతం పూర్తయిన తర్వాత తిరిగి బయలుదేరాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం వేడుకగా, ఘనంగా జరిగింది. ఆ సమయంలో మెట్రో రైలును కూడా అధికారులు నిలిపివేశారు. ఈ నెల 22వ తేదీ వరకూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో జరగనున్నాయి. 22న ముగింపు సందర్భంగా ఎల్బీ స్టేడీయంలో ర్యాలీ జరగనుంది.
Next Story