Mon Dec 23 2024 17:22:51 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ తో సహా వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి
వేలేరు మండలంలోని కన్నారం దగ్గర ఉన్న వాగులో వరదనీరు చేరుకోవడంతో భారీ ఎత్తున పొంగిపొర్లుతూ ఉండటంతో అక్కడ రాకపోకలు
వరంగల్, హనుమకొండ జిల్లాలలో భారీగా కురిసిన వర్షాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలలో వాగులు, చెరువులు బాగా ఉన్నాయి. అయితే గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు భారీగా వాగులు, చెరువులలో చేరిపోవడంతో అవి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు, అధికారులు ఎవరూ ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదని హెచ్చరికలు చేస్తున్నారు. అయినా కూడా కొంతమంది బయటికి వెళ్లి ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇటువంటి సంఘటనే హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
వేలేరు మండలంలోని కన్నారం దగ్గర ఉన్న వాగులో వరదనీరు చేరుకోవడంతో భారీ ఎత్తున పొంగిపొర్లుతూ ఉండటంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఓ వ్యక్తి బైక్ తీసుకొని బయటికి వెళ్తున్న సమయంలో గ్రామస్తులు వద్దని వారించారు. అయినా కూడా వినకుండా వాగు దాటేందుకు ప్రయత్నం చేయగా వరదనీటి ప్రవాహం ఎక్కువ అవ్వడంతో ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి బైక్ తో సహా ఆ వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మహేందర్ గా గ్రామస్తులు గుర్తించారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొట్టుకుపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story