Mon Dec 23 2024 14:58:37 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉట్నూరు మండలం కుమ్మరి తండాలో ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు.
మంచు కారణంగానే....
మృతులు నార్పూర్ మండలం తడి హత్నూరుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. రాత్రి వేళ దట్టంగా మంచుకురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడక ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరు రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story