Mon Dec 23 2024 14:36:25 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫామ్ హౌస్ కేసులో విచారణ కోసం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీీవీ ఆనంద్ నేతృత్వంలో ఈ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు పోలీసు అధికారులను కూడా భాగస్వామ్యులను చేసింది.
సిట్ ఏర్పాటు...
ఫాం హౌస్ కేసులో హైకోర్టు స్టే ఎత్తివేయడంతో వెంటనే ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. మొయినాబాద్ ఫాం హౌస్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో ఎవరెవరు భాగస్వామ్యులయ్యారు? ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై ఈ బృందం ఆరా తీయనుంది. జైల్లో ఉన్న నిందితులను ఈ టీం తమ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి.
Next Story