Mon Dec 23 2024 08:20:14 GMT+0000 (Coordinated Universal Time)
తార్నాకలో దారుణం.. లిఫ్ట్ పేరుతో మహిళపై బలాత్కారం
తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన మహిళ.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన..
హైదరాబాద్ లోని తార్నాకలో ఓ మహిళపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత సోమవారం అనగా జూన్ 26వ తేదీన జరిగిన ఈ ఘటన 8 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు తార్నాకలో శ్రీధర్ అనే యువకుడు రాత్రి 11.30 గంటల సమయంలో లిఫ్ట్ ఇస్తానంటూ తన బైక్ పై ఎక్కించుకున్నాడు. కొంతదూరం వచ్చాక బైక్ ను సల్మాన్ హోటల్ సమీపంలో రోడ్డు పక్కకు ఆపి.. తనపై బలాత్కారం చేయబోయాడంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని నుండి తప్పించుకునే క్రమంలో బైక్ పై నుంచి దూకడంతో.. వెనుక నుంచి వచ్చిన లారీ కింద పడ్డానని తెలిపింది.
తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన మహిళ.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శ్రీధర్ కోసం గాలిస్తుండగా.. జులై 3న తన లాయర్ తో కలిసి ఓయూ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తన కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలని, తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ రోధిస్తోంది. తన బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. అసలు జూన్ 26వ తేదీన ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Next Story