Mon Dec 23 2024 17:11:07 GMT+0000 (Coordinated Universal Time)
రేపు తెలంగాణలో పాఠశాలలు బంద్
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ.. ఎలక్షన్ ఫండింగ్ కు అమ్ముడుపోయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపు పాఠశాలల బంద్ కు అఖిల భారత విద్యార్థి సంఘం (ABVP) పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ.. విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ రాష్ట్ర నాయకులు తెలిపారు. అలాగే విద్యార్థులకు వెంటనే పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ.. ఎలక్షన్ ఫండింగ్ కు అమ్ముడుపోయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ఆరోపించారు. ఖాళీగా ఉన్న 15 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని, ఖాళీగా ఉన్న డీఎస్సీ, ఎంఈఓ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం అండచూసుకుని.. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రుల్ని నిలువుదోపిడీ చేస్తున్నాయని ఆమె ఆవేదన చెందారు. అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. పుస్తకాలను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నాయని, ఆయా కార్పొరేట్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story