Sat Nov 30 2024 16:48:49 GMT+0000 (Coordinated Universal Time)
Acb Raids : వామ్మో ఈ అధికారి ఆస్తులు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖకు చెందిన ఏఈఈ నిఖేశ్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు
రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖకు చెందిన ఏఈఈ నిఖేశ్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. నితీశ్ కుమార్ ఇంటితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మొత్తం ముప్ఫయి ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించగా కళ్లు బైర్లు కమ్మే క్యాష్ బయటపడినట్లు తెలిసింది.కేజీల కొద్దీ బంగారం, వెండి ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ గుర్తించిన నితేష్ కుమార్ ఆస్తుల విలువ మూడు వందల కోట్లకు పైగానే అని అధికారులు తెలిపారు.
మార్కెట్ విలువ ప్రకారం...
మార్కెట్ విలువ ప్రకారం 150 కోట్లు ఉండొచ్చని అంచనా వేసినా, అసలు విలువ మూడు వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నితీశ్ కుమార్ ఆరు నెలల క్రితమే సస్పెన్షన్ కు గురయ్యాడు. ఒకరి నుంచి రెండున్నర లక్షల రూపాయలు లంచం అడిగిన కేసులో ఆయన ఇంట్లో ఆరు నెలల క్రితం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు పలు చోట్ల ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఒక ఏఈఈ ఇంత ఆస్తులను ఎలా కూడబెట్టారన్న దానిపై ఏసీబీ అధికారులు సయితం అవాక్కయినట్లు తెలిసింది.
Next Story