Sat Apr 12 2025 16:20:47 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం..ఒక వాహనంతో మరొక వాహనం
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్ లోని వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్ లోని వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఒక వాహనంతో మరొకటి ఢీకొట్టడంతో కేసీఆర్ కాన్వాయ్ లో ఉన్న దాదాపు పది వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వేములపల్లి శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మిర్యాలగూడకు వెళతుండగా....
కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి బస్సు యాత్రగా మిర్యాలగూడకు వెళుతున్నారు. అక్కడ జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. అనంతరం సూర్యాపేట రోడ్ షోలో ప్రసంగిస్తారు. ఈరోజు రాత్రికి సూర్యాపేటలోనే కేసీఆర్ బస చేయనున్నారు. నేటి నుంచి నాన్ స్టాప్ గా పదిహేడు నియోజకవర్గాలలో కేసీఆర్ పర్యటించనున్నారు.
Next Story