Sat Nov 23 2024 04:57:49 GMT+0000 (Coordinated Universal Time)
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కొనుగోళ్లు, అమ్మకాలతో సంబంధం లేకుండా పెరిగే వస్తువు బంగారం ఒక్కటే కావచ్చు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బంగారం పెరుగుతుందని తెలిసే ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. పెరిగిన రోజు బంగారం వ్యాపారం తగ్గింది లేదని వ్యాపారులు చెబుతున్నారు.
పదిగ్రాములకు....
దేశంలో ప్రస్తుతం పదిగ్రాముల బంగారం 370 రూపాయలు పెరిగింది. అంటే గ్రాముకు 37 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రకారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,050 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దరల 49,150 రూపాయలు ఉంది.
Next Story