Sat Nov 23 2024 02:23:30 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : వావ్.. జూన్ మొదటి వారం నుంచే ఏసీలు ఆన్ చేయాల్సిన అవసరం లేదట.. ఎందుకంటే?
అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించే చల్లటి కబురు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వందేళ్లలో ఈ సమయంలో ఇంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని వాతావరణ శాఖ కూడా చెబుతుంది. ఎండల దెబ్బకు జనం హడలి పోతున్నారు. బయటకు రావడానికే జంకుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉక్కపోతతో ప్రారంభమయ్యే ఎండ తీవ్రత సాయంత్రం అయినా కూడా వేసవి తగ్గడం లేదు. ఇలా మార్చి నెల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎండ దెబ్బకు తాళలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నెల 19 నుంచే...
అయితే ఎండల నుంచి ఉపశమనం కలిగించే చల్లటి కబురు వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రానున్నాయని తెిపింది. ఈ నెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండటంతో ఎండల తీవ్రత తగ్గుతుందని చెబుతున్నారు. తర్వాత కేరళలో ప్రారంభమై ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు వర్షాలు వస్తాయని చెప్పడంతో ఈఏడాది జూన్ మొదటి వారానికి వాతావరణం చల్లబడే అవకాశముంది.
Next Story