Fri Nov 22 2024 15:34:27 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్... అతనికి మంకీపాక్స్ లేదు
కామారెడ్డి యువకుడికి పూనే ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మంకీపాక్స్ నెగిటివ్ గా తేలింది.
మంకీపాక్స్ తెలంగాణలోనూ కలకలం రేపింది. కువైట్ నుంచి వచ్చిన యువకుడికి శరీరంపై దుద్దుర్లు రావడంతో అతనికి మంకీపాక్స్ అని అనుమానించారు. అతనిని హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులను సయితం ఐసొలేషన్ కు తరలించారు. యువకుడి రక్త నమూనాలను పూనేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.
ఊపిరి పీల్చుకున్నా....
కానీ పూనే ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మంకీపాక్స్ నెగిటివ్ గా తేలింది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. మంకీపాక్స్ వచ్చినా భయపడాల్సిన పనిలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతూ వచ్చారు. కానీ కామారెడ్డి జిల్లాలో కొంత భయం ప్రజల్లో ఉంది. అయితే యువకుడికి నెగిటివ్ రావడంతో జిల్లా ప్రజలు సయితం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు యువకుడికి మంకీపాక్స్ సోకలేదని ప్రకటించింది.
Next Story