Wed Dec 18 2024 22:15:15 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు బెయిల్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ లభించింది. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందులకు బెయిల్ లభించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ లభించింది. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందులకు బెయిల్ లభించింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ ఫాం హౌస్ లో ఈ ముగ్గురు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో టైపులను బయటకు పెట్టడంతో పాటు కాల్ డేటాను కూడా సేకరించారు. వీరిని అరెస్ట్ చేశారు.
ప్రతి సోమవారం...
ప్రతి సోమవారం మాత్రం సిట్ ముందు ముగ్గురు నిందితులు హాజరు కావలని హైకోర్టు ఆదేశించింది. మూడు లక్షల రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురు పాస్‌పోర్టులను పోలీస్ స్టేషన్ లో జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని కోరింది.
Next Story