Fri Apr 11 2025 21:00:28 GMT+0000 (Coordinated Universal Time)
కొండా కామెంట్స్ పై రకుల్ ప్రీత్ ఏమన్నారంటే?
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు.

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఒక మహిళగా ఉన్న మంత్రి మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనను బాధించాయని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన చెందారు.
రాజకీయంగా ఉండాలని...
హుందాగా వ్యవహరించాలనే తాము నిశ్శబ్దంగా ఉన్నామని తెలిపారు. కానీ దానిని బలహీనతగా తీసుకుని రాజకీయ నేతలు తమ ప్రయోజనాల కోసం తమ పేరును వాడుకుంటున్నారని రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును ఉపయోగించవద్దని ఆమె కోరారు. వార్తల్లో నిలిపేందుకు సెలబ్రిటీల పేర్లను వాడుకోవద్దంటూ రకుల్ ప్రీత్ సింగ్ హితవు పలికారు.
Next Story