Fri Jan 03 2025 00:43:03 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అదానీ గ్రూపు తెలంగాణాకు భారీ బహుమతి
తెలంగాణ ప్రభుత్వానికి అదానీ గ్రూపు సంస్థలు భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ విరాళం వంద కోట్ల రూపాయలు
తెలంగాణ ప్రభుత్వానికి అదానీ గ్రూపు సంస్థలు భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ విరాళం వంద కోట్ల రూపాయలు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చింది. ఈ చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ స్వయంగా కలసి వంద కోట్ల రూపాయల చెక్కును అందచేశారు. యువతకు నైపుణ్యాలను అందించడంలో స్కిల్ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుందని అదానీ భావించి ఈ విరాళాన్ని అందచేశారు.
పదిహేడు రకాల...
17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఏటా లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చి వారికి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించేందుకు ఈ యూనివర్సిటీ ఉపయోగపడుతుందని భావించారు. అందుకే అదానీ ఇంత భారీ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. నవంబరు 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం కానున్నాయి.
Next Story