Sun Dec 22 2024 22:18:31 GMT+0000 (Coordinated Universal Time)
Cpi : సీపీఐలో సీట్ల కోసం సిగపట్లు
సీపీఐలో సీట్ల సర్దుబాటు ఇబ్బందిగా మారింది. చెన్నూరు టిక్కెట్ వద్దంటూ పెద్దయెత్తున నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు
సీపీఐలో సీట్ల సర్దుబాటు ఇబ్బందిగా మారింది. చెన్నూరు టిక్కెట్ వద్దంటూ సింగరేణి నుంచి పెద్దయెత్తున నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. చెన్నూరు తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చెబుతున్నారు. మునుగోడు టిక్కెట్ ను మాత్రమే తీసుకోవాలని, ఆ దిశగా ప్రయత్నించాలని సీపీఐ నేతలు కోరుతున్నారు.
మునుగోడు కావాలని...
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి సీపీఐ పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంకా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. చెన్నూరు సీటు వద్దే వద్దంటూ అక్కడి నేతలు కోరుతున్నారు. మునుగోడు టిక్కెట్ తీసుకోవాలని కోరుతున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏ సీటును సీపీఐకి ఇస్తుందన్నది చూడాలి. కొత్తగూడెంతో పాటు మునుగోడు సీటును తీసుకోవాలని వారు బలంగా కోరుతున్నారు. కాంగ్రెస్ మాత్రం చెన్నూరు టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధపడటంతో సీపీఐ నేతలు అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది.
Next Story