Tue Nov 05 2024 16:45:51 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన లోక్సభ
టీఆర్ఎస్ పేరు నుంచి బీఆర్ఎస్ గా మార్పు జరిగిన తర్వాత లోక్సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది
టీఆర్ఎస్ పేరు నుంచి బీఆర్ఎస్ గా మార్పు జరిగిన తర్వాత లోక్సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్కు ఇంకా గుర్తింపు ఇవ్వలేదని పేర్కొంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జాబితా నుంచి బీఆర్ఎస్ ను తొలగిస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. లోక్ సభలో ఆరుగు అంతకంటే ఎక్కువ సభ్యులు ఉంటే బీఏసీలో సభ్యత్వాన్ని కల్పించడం ఆనవాయితీగా వస్తుంది.
ఆహ్వానితులుగానే...
దీంతో టీఆర్ఎస్ ను బీఏసీ నుంచి తొలగించినట్లు కూడా లోక్సభ సచివాలయం తెలిపింది. అయితే టీఆర్ఎస్ కు తొమ్మిది మంది సభ్యులున్నప్పటికీ లోక్సభలో పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావును ఆహ్వానితుడిగానే తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి మోదీ సర్కార్ పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి చర్యలు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
Next Story