Mon Dec 15 2025 04:14:37 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus : ఉచిత బస్సులోనే పళ్లుతోముకుంటున్న ఈమెను చూశారా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కలసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. ఎక్కువ మంది మహిళలే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పధకం ద్వారా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టింది.
విచిత్రాలకు నెలవు...
అయితే ఫ్రీ బస్సు మొదలయిననాటి నుంచి అనేక రకమైన విచిత్ర వార్తలు కనిపిస్తున్నాయి. మహిళలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకున్న వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఒక మహిళ ఉచిత బస్సులో ప్రయాణిస్తూ బ్రష్ తో పళ్లు తోముకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హతవిధీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Next Story

