Mon Nov 25 2024 08:56:25 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏఐసీసీ కీలక ప్రకటన.. వారే కో - ఆర్డినేటర్లు
తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు కో - ఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు కో - ఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. పదిహేడు నియోజకవర్గాలకు కో -ఆర్డినేటర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా బాధ్యతలను అప్పగించారు. ఆయనకు చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాల బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలోని పదిహేడు నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలను కో - ఆర్డినేటర్లుగా నియమించడంతో అక్కడ అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ గెలుపు సాధించేంత వరకూ నేలు శ్రమించాల్సి ఉంది.
పార్లమెంటు నియోజకవర్గాలకు...
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి, కొండా సురేఖకు వరంగల్, మహబాబాబాద్, ఖమ్మం లోక్ సభ స్థానాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాలకు మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ పార్లమెంటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్ గిరికి తుమ్మల నాగేశ్వరరావు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావులను నియమిస్తూ ఏఐసీనసీ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులతో పాటు కొందరు సీనియర్ నేతలకు కూడా బాధ్యతలను అప్పగించింది.
Next Story