Mon Dec 23 2024 14:56:33 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెండోసారి ఈ నోటీసులను జారీ చేసింది. గత నెల 22న ఒకసారి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయినా దానికి వివరణ ఇవ్వలేదు. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కోరింది. మునుగోడు ఉప ఎన్నికల్లో తన సోదరుడిని గెలిపించాలన్న ఆడియో లీకుపై ఈ నోటీసులు జారీ చేసింది.
వివరణ ఇవ్వకపోవడంతో...
అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడంతో దానికి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇచ్చే సమయం కూడా ముగిసింది. దీంతో కోమటిరెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెండో నోటీసుకైనా కోమటిరెడ్డి వివరణ ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story