Sun Dec 29 2024 14:10:47 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు హైదరాబాద్కు ఖర్గే రాక
ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు హైదరాబాద్ రానున్నారు కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొననున్నారు
ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు హైదరాబాద్ రానున్నారు. ఎల్బి స్టేడియంలో జరగనున్న కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరాన్ని గురించి ప్రజలకు వివరించాలని తెలియజేయనున్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో...
అలాగే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన హామీలను గురించి వివరించాలని బూత్ లెవెల్ కమిటీ కార్యకర్తలకు తెలియజేయనున్నారు. అత్యధిక స్థానాలను గెలుచుకునేలా బూత్ లెవెల్ కమిటీలు శ్రమించాలని ఈ సమావేశంలో నేతలు పిలుపు నివ్వనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా హాజరు కానున్నారు.
Next Story