Sat Nov 23 2024 00:14:06 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయె
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ శనివారం నుండి జరగనున్నాయి. నాలుగు రోజుల
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ శనివారం నుండి జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లోనే ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకరం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్నారు. ప్రొటెం స్పీకర్ చేత రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రమాణం చేయించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ హోదాలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలను అక్బరుద్దీన్ ఓవైసీ నిర్వహించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఇక తర్వాత బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీరిలో అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు దక్కాయి.
Next Story