Sun Dec 22 2024 18:51:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతుంది.
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతుంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. ఆయనతో పాటు వివిధ రంగాలకు చెందిన వారితో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరవుతున్నారు.
19 వ ఏట...
ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే విధంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే తెలంగాణ వంటకాలు కూడా అతిధులకు అందిస్తారు. 2005 నుంచి ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 19వ ఏట దత్తన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
Next Story