Mon Dec 23 2024 02:23:19 GMT+0000 (Coordinated Universal Time)
జాతరకు సర్వం సిద్ధం.. 18న కుటుంబ సమేతంగా మేడారంకు రానున్న సీఎం కేసీఆర్
గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క చిన్న లోటు కూడ లేకుండా చేయాలని సీఎం ఆదేశించగా.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు
తెలంగాణలోని మేడారంలో మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. ఆదివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్ సకుటుంబ సమేతంగా మేడారంకు విచ్చేసి, వనదేవతలను దర్శించుకోనున్నట్లు వెల్లడించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క చిన్న లోటు కూడ లేకుండా చేయాలని సీఎం ఆదేశించగా.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల.. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎక్కడా పారిశుధ్య లోపం లేకుండా.. ఎప్పటికప్పుడే చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే భక్తులు కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఎర్రబెల్లి దయాకర్ సూచించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా జాతర సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
Next Story