Mon Dec 23 2024 20:15:56 GMT+0000 (Coordinated Universal Time)
392 కు దొరికే బాల్ కు 1400 రూపాయలు ఖర్చు పెట్టారట!!
హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మల్కాజ్ గిరి కోర్టును ముందస్తు బెయిల్ కోసం
హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మల్కాజ్ గిరి కోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. హెచ్సీఏలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని అజారుద్దీన్ మీద కేసు నమోదైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజారుద్దీన్ టెండర్ల పేరుతో థార్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని జస్టిస్ లావ్ నాగేశ్వరరావు కమిటీ నాలుగు కేసులు పెట్టింది.
జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఆగస్టు 10వ తేదీన హెచ్సీఏ నిధుల గోల్మాల్ ఆడిట్ నిర్వహించింది. ఈ ఆడిట్లో క్రికెట్ బాల్స్ కొనుగోలు వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. ఒక్కో బాల్ ను రూ. 392కు రూ. 1400 వర్క్ ఆర్డర్ చేసినట్లు బయటపడింది. క్రికెట్ బాల్స్ కొనుగోలు వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 57 లక్షల రూపాయల నష్టం, బకెట్ కుర్చీల కొనుగోలులో రూ. 43 లక్షలు నష్టం, ఫైర్ ఫైటింగ్ పరికరాల కొనుగోలు వ్యవహారంలో రూ.1.50 కోట్లు, జిమ్ పరికరాల పేరుతో రూ.1.53 కోట్లు నష్టం వచ్చిందని కమిటీ తెలిపింది. ఉప్పల్ పోలీసులు అజారుద్దీన్ మీద నాలుగు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైనప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మల్కాజ్ గిరి కోర్టులో అజారుద్దీన్ పిటిషన్ వేశారు. అజారుద్దీన్ వేసిన ఈ బెయిల్ పిటిషన్ మీద మల్కాజిగిరి కోర్టు నవంబర్ ఒకటవ తేదీన విచారణ చేపట్టనుంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి కోట్ల రూపాయల నిధులు కట్టబెట్టారని, భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆడిట్ నిర్వహించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ నిర్ధారించింది. అగ్నిమాపక, జిమ్సామాగ్రి, క్రికెట్ బంతులు, బకెట్కుర్చీల తదితర వస్తువుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు కమిటీ గుర్తించింది.
Next Story