Sun Nov 17 2024 19:39:47 GMT+0000 (Coordinated Universal Time)
Congress, CPI పొత్తు కుదిరింది..
కాంగ్రెస్ పార్టీ సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి
కాంగ్రెస్ పార్టీ సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సీపీఐ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంచిన ప్రతిపాదనకు చివరకు అంగీకరించింది. సీపీఎం ఇప్పటికే పథ్నాలుగు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారు ఒక పొత్తుకు తాము అంగీకరించబోమని, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాలు...
కానీ సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు సిద్ధమయింది. సీపీఐకి కొత్తగూడెం సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. కొత్తగూడెం సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీ పదవులను కూడా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ప్రతిపాదనకు సీపీఐ అంగీకరించింది. దీంతో సీపీఐ, సీపీఎంలు విడివిడిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Next Story