Tue Apr 08 2025 11:37:09 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ అధికారుల వద్దకు అల్లు అర్జున్ మామ

సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. తన ఇంటి స్థలం గురించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-92లో తమ ప్రాపర్టీస్ విషయంపై పునరాలోచించాలని ప్రజావాణిలో ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలన్నారు. రోడ్డు విస్తరణలో తన ప్లాటు ఒకవైపు 20 అడుగులు మరోవైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను కోరారు. గ్రీన్ లాండ్స్లోని మహాత్మ జ్యోతి రావు పూలే భవనంలో నిర్వహిస్తున్నప్రజావాణికి ఆయన ఫిర్యాదు చేశారు.
కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే రోడ్డు విస్తరణతో పాటుగా పలు కార్యక్రమాలను చేపట్టారు. పలువురు ప్రముఖులకు సంబంధించిన భూమిని అధికారులు సేకరించే పనిలో ఉన్నారు.
Next Story