Sun Apr 20 2025 21:05:27 GMT+0000 (Coordinated Universal Time)
రెండు సిద్ధమే.. ప్రారంభం ఎప్పుడంటే?
తెలంగాణ కొత్త సచివాలయంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి..

తెలంగాణలో రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ కొత్త సచివాలయంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణ సచివాలయానికి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. పెండింగ్ పనులు కొద్దిగా ఉండటంతో నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం అనేది ఇంకా తేలలేదు.
వచ్చే నెల 14న...
కానీ ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేశారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమానికి జాతీయ నేతలను కూడా ఆహ్వానించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.
Next Story