Mon Dec 23 2024 06:45:55 GMT+0000 (Coordinated Universal Time)
దీపావళి వేడుకల్లో అపశృతి... 24 మందికి గాయాలు
దీపావళి వేడుకలు ఘనంగా జరిగినా పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి
దీపావళి వేడుకలు ఘనంగా జరిగినా పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. చిన్న పిల్లలు సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడ్డారు. పటాకులు పేలి కళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 24 మంది సరోజినిదేవి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. దీపావళి టపాసులు పేల్చడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఏటా కొంత మంది ఇలా ఆసుపత్రి పాలవుతంటారు.
సరోజిని దేవి ఆసుపత్రికి...
దాదాపు 24 మంది సరోజిని దేవి ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. వీరిలో 12 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఆసుపత్రి పాలయ్యారని వైద్యులు చెబుతున్నారు.
Next Story