Mon Dec 23 2024 07:29:49 GMT+0000 (Coordinated Universal Time)
Tsrtc : మహిళలకు టిక్కెట్లు కొట్టిన కండక్టర్... వెంటనే సస్పెన్షన్
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించినా కండక్టర్ లు మాత్రం టిక్కెట్లు తీసుకోవాల్సిందేనంటున్నారు
రాష్ట్రంలో నిన్నటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆర్టీసీ సిబ్బంది మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. కొందరు మహిళలకు టిక్కెట్లు కొనుగోలు చేయనిదే బస్సులోకి అనుమతించబోనివ్వమని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నిజామాబాద్ నుంచి బోధన్‌కు...
ఆర్టీసీ కండక్టర్ ఒకరు మహిళలకు టిక్కెట్లు తీసుకోవాలని కోరారు. ఉచిత ప్రయాణం ప్రభుత్వం కల్పించింది కదా? అని ప్రశ్నించినా ఆ కండక్టర్ అంగీకరించలేదు. టిక్కెట్ కొంటేనే ప్రయాణం వీలవుతుందని చెప్పి వారి వద్ద నుంచి టిక్కెట్ కొనుగోలు చేశారు. నిజామాబాద్ నుంచి బోధన్ నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. వెంటనే కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ గా మారింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ టిక్కెట్ ను మహిళల నుంచి తీసుకున్న కండక్టర్ ను విధుల నుంచి తప్పించారు. దీనిపై సజ్జనార్ విచారణకు ఆదేశించారు.
Next Story