Fri Nov 22 2024 14:41:53 GMT+0000 (Coordinated Universal Time)
అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా అన్నారు. సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా అన్నారు. సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఇర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే దళితులను సీఎం చేస్తుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దళిత, బీసీ వ్యతిరేక పార్టీ అని ఆయన అన్నారు. బీజేపీ మాట ఇస్తే తప్పదన్నారు. బీజేపీ పేదల పార్టీ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కుటుంబ పార్టీలని ఆయన ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలకు ప్రజల సంక్షేమం పట్టదన్న అమిత్ షా రాహుల్ ను సీఎం చేయడం సోనియా గాంధీ లక్ష్యమైతే, తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కేసీఆర్ టార్గెట్ అని ఆయన అన్నారు.
కుటుంబ పార్టీలు...
తెలంగాణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమగ్రమైన అభివృద్ధి వైపు తెలంగాణ పయనించేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ లో సమ్మక్క సారక్క ట్రైైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. పసుపు రైతులకు బోర్డు కూడా ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ హక్కుల కోసం కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ ఏర్పాటు చేశామని అమిత్ షా తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న వాగ్దానం ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు.
Next Story