Mon Dec 23 2024 00:35:49 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా ను అడ్డుకుంటున్న వరుణుడు
కేంద్ర హోం మంత్రి అమిత్షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం శనివారం హైదరాబాద్కు చేరుకుని
కేంద్ర హోం మంత్రి అమిత్షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం శనివారం హైదరాబాద్కు చేరుకుని జెఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఈ పర్యటన రద్దయినట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. అమిత్ షా ఈ నెల 29 న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని మొదట చెప్పారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఫిలింనగర్ విస్పర్ వ్యాలీలోని జేఆర్సీ కన్వెన్షన్ లో “ప్రజాస్వామ్య తెలంగాణ కోసం సామాజిక వర్గాల సమావేశం” పేరుతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు, ఆయా వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారని అన్నారు. అయితే అనుకోని కారణాల వలన ఈ పర్యటన రద్దైందని బీజేపీ నేతలు తెలిపారు.
2023 జూన్ 15న ఖమ్మం జిల్లా భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. ఆ సమయంలో గుజరాత్ లో వచ్చిన సైక్లోన్ తో అది వాయిదా పడింది. ఖమ్మంలో జరగాల్సిన అమిత్ షా ప్రోగ్రామును జూలై 29కి హైదరాబాద్ కు మార్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండంటంతో మరోసారి అమిత్ షా టూర్ వాయిదా పడింది. త్వరలోనే అమిత్ షా టూర్ కు సంబంధించి మరో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Next Story