Fri Nov 22 2024 12:16:52 GMT+0000 (Coordinated Universal Time)
పంటపొలాల్లో కూలిన డ్రోన్ విమానం.. ఆందోళనలో గ్రామస్తులు
ఈ డ్రోన్ బ్యాటరీ సపోర్ట్ తో నడిచినట్లు గుర్తించారు. 5 అడుగుల పొడవు, వెడల్పు 15 కిలోల బరువు ఉన్న డ్రోన్ విమానంపై..
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పంటపొలాల్లో విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ కూలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూలిన డ్రోన్ ను చూసి తొలుత అందరూ భయపడ్డారు. ఇది గమనించిన స్థానిక యువకులు 100కు డయల్ చేసి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి కూలిన డ్రోన్ ను పరిశీలించారు.
విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ లో సీసీ కెమెరాలు ఎయిర్ టెల్ సిమ్ తో జిపిఎస్ సిస్టం ఉందని తెలుసుకున్నారు. ఈ డ్రోన్.. బ్యాటరీ సపోర్ట్ తో నడిచినట్లు గుర్తించారు. 5 అడుగుల పొడవు, వెడల్పు 15 కిలోల బరువు ఉన్న డ్రోన్ విమానంపై 76 కోడ్ నెంబర్ ఉందన్నారు. కాగా.. ఆదివారం ఉదయం 11.20 గంటల సమయంలో తాము పంపిన సర్వే విమానం వట్టిపాముల గ్రామంలో తప్పిపోయిందంటూ ఫిర్యాదు చేశారు. కూలిన డ్రోన్ వారికి చెందినదేనని పోలీసులు తెలిపారు. కాకినాడ నుంచి గుజరాత్ వరకు చేపట్టబోయే గ్యాస్ పైప్ లైన్ కోసం సర్వే చేస్తుండగా డ్రోన్ కూలిపోయిందని, అది తమ కంపెనీకి చెందినదేనని తుషార్, బలిజ జగదీష్ లు పోలీసులకు తెలిపారు. సర్వేకు సంబంధించిన అనుమతి పత్రాలను పోలీసులకు అందజేశారు.
Next Story